ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల షెడ్యూల్ విడుదల

Wed,January 11, 2017 02:03 AM

గోవిందరావుపేట, జనవరి10 : 2017-18 విద్యాసంవత్సరానికి ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సలీంపాషా తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వీటిలో ప్రవేశం కోసం ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50, ఓసీ విద్యార్థులు రూ.100 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 నుంచి 26వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 26న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 9న విద్యార్థుల మెరిట్ లీస్ట్, 17, 18 తేదీల్లో అడ్మిషన్స్ ఉంటాయని

29
Tags

More News

మరిన్ని వార్తలు...