సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి


Wed,January 11, 2017 02:02 AM


చిట్యాల, జనవరి 10 : మారుతున్న పరిస్థితులకనుగుణంగా రైతులు వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన రైతు మేరుగు సమ్మయ్య వ్యవసాయశాఖ సూచన ప్రకారం నర్సరీ పద్ధతిలో కందిపంటను సాగుచేయగా మంగళవారం వ్యవసాయాధికారి నాలికె రఘుపతి ఆధ్వర్యంలో రైతులతో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు పత్తిపంట సాగును తగ్గించాలని సూచించారు.

కొత్త పద్ధతులతో కొత్త పంటలను వేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త వి.తిరుమల్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి కె.అనురాధ, భూపాలపల్లి సహాయ సంచాలకులు ఆర్.సత్యంబాబు, జడ్పీటీసీ సభ్యుడు కాట్రేవుల సాయిలు, ఎంపీపీ బందెల స్నేహలత, సింగిల్‌విండో చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, వ్యవసాయాధికారులు గణేశ్, సురేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఏఈవో గోపీనాథ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆత్మ సభ్యులు పాల్గొన్నారు.

39
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS