విషప్రయోగానికి మూగజీవాలు బలి


Wed,January 11, 2017 02:01 AM


కాటారం, జనవరి 10 : అడవి పందుల కోసం చేసిన విషప్రయోగానికి మూగ జీవాలు బలయ్యాయి. విషగుళికలు వేసిన గడ్డిని తిని 200 గొర్రెలు మృత్యువాత పడ్డ సంఘటన మండలంలోని దామెరకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దుబ్బపల్లికి చెందిన రాధారపు తిరుపతి, లింగయ్య, పర్వతాలు, మొండయ్య, సింగనవేన పెద్ద మల్లేశ్, చిన్న మల్లేశ్, శేఖర్, ఆత్కకూరి లచ్చయ్య మూడురోజుల క్రితం తమ గొర్రెలను మేపేందుకు గూడూర్ ఊర చెరువు వెనుక తీసుకెళ్లారు. అక్కడ మేత మేసిన తర్వాత నీళ్లు తాగిన వెంటనే నోటి నిండా నురుగులు వచ్చి కొన్ని గొర్రెలు చనిపోయాయి.

దీంతో పెంపకందారులు మిగతా వాటికి వైద్యం చేయించారు. అయినా రోజురోజుకూ గొర్రెలు చనిపోతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి విలువ సుమారు రూ.పది లక్షలు ఉంటుందని చెప్పారు. అయితే, అడవి పందుల కోసం వేసిన విషగుళికలు తినడం వల్లే తమ గొర్రెలు మృతిచెందాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే, మంగళవారం ఇన్‌చార్జి పశువైద్యాధికారి మల్లేశ్ గ్రామానికి వెళ్లి మృతిచెందిన గొర్రెలకు పోస్ట్‌మార్టం నిర్వహించి, విష గుళికలు తిన్న లక్షణాలు ఉన్నాయని తెలిపారు.

143
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS