ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్


Wed,January 11, 2017 02:01 AM

తాడ్వాయి, జనవరి 10 : మండలకేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆ శ్రమ బాలికల పాఠశాలను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోకి వచ్చిన కలెక్టర్‌కు వి ద్యార్థులు ఎవరూ లేకపోవడంతో ఆరా తీశారు. సెలవులు రాకముందే ఇళ్లకు పంపుతారా అని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మి, హెచ్‌ఎం రజితలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 11నుంచే సెలవులు ఇచ్చారని హెచ్‌ఎం తెలుపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్లారని తెలిపారు. సెలవులు 12 నుంచి అయితే 10నాడే ఎలా పంపుతారని మందలించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మయ్య, వీఆర్వో నారాయణ తదితరులున్నారు.

49
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS