సాఫీగా ప్రయాణం


Wed,November 13, 2019 03:04 AM

జనగామ టౌన్‌, నవంబర్‌ 12: జనగామ డిపో పరిధిలోని 37 రూట్లలో 125 బస్సులకు మంగళవారం 100 ఆర్టీసీ బస్సులకు 95 , 21 అద్దె కాగా 21 బస్సు సర్వీస్‌లతో కలిపి మొత్తం 116ఆర్టీసీ బస్సులు నడిపించారు. ఆర్టీసీ కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేపట్టి మంగళవారం 39రోజుకు చేరింది. దీంతో ప్రభుత్వం ముందస్తుగా చేపడుతున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జనగామ డిపోలోని బస్సులు నిరాటంకంగా నడుస్తుండగా ప్రయాణికులు సురక్షితంగా వారివారి గమ్యస్థానాలను చేరుకుంటున్నా రు. ఇదిలా ఉండగా డిపో గ్యారేజీలోని బస్సులు, గ్యారేజీ స్టోర్స్‌ వివరాలను డీఎం ధరంసింగ్‌, డీటీవో రమేశ్‌రాథోడ్‌, ఎంవీఐ సాయిచరణ్‌ అడిగి తెలుసుకోవడంతోపాటు బస్సుల రవాణాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌ సైతం బస్సుల రవాణాలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత డిపో నోడల్‌ అధికారులను ఆదేశించారు.


38 రోజుల్లో రూ.2,67,56,574 ఆదాయం
38 రోజుల్లో ప్రత్యామ్నాయంతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు 12,47,725 కిలో మీటర్లు తిరుగగా రూ.2,67,56,574 ఆదాయం కూరిందని, ఇందులో తాత్కాలిక సిబ్బంది రోజువారీ వేతనాలు పోను మిగిలిన నగదును డిపో బ్యాంక్‌లో జమ చేసినట్లు డిపో అధికారులు వెల్లడించారు.

75

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles