కాంగ్రెస్‌, బీజేపీ విమర్శలు మానుకోవాలి


Wed,November 13, 2019 03:03 AM

పాలకుర్తి రూరల్‌ నవంబర్‌ 12 : రాష్ట్రంలోని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నాయకులు అవగాహన లేకుండా సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వెంటనే మానుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలన భేష్‌.. అని కొనియాడారు. ప్రధాని మోడీ కేంద్ర మం త్రులు సీఎం కేసీఆర్‌ పాలన, పథకాలపై ప్రశంసలు కురిపిస్తుంటే స్థానిక రాష్ట్రనాయకులు అవగాహన లేకుండా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.13వేల కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టిందన్నారు. పత్తిని ఎందుకు కొనుగోలు చేస్త్తలేరో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. పత్తి కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులను ఆదుకోవాలని సూచించారు. పత్తికి మద్దతు ధర లేదన్నారు. ధాన్యం కొనుగోలును ఇతర రాష్ర్టాలు చేతులేత్తాశాయన్నారు. కాంగ్రెస్‌ బీజేపీ నాయకులు అభివృద్ధి నిరోధకులన్నారు. ఇకనైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ బీజేపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు.


సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అద్భుత పథకాలని కేంద్రం మెచ్చుకున్నదన్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌ మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలపై సీఎం కేసీఆర్‌ను స్వయంగా అడిగి తెలుసుకుని ప్రశం సలు కురిపించారన్నారు. అన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తా మని మంత్రి తెలిపారన్నారు. మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శమన్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమన్నారు. రూ.45వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకం ప్రవేశ పెట్టా మన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువులను నింపా మ న్నారు. కాకతీయ రాజులు కట్టిన గోలుసు కట్టు చెరు వులను బాగుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిం దన్నారు. మిషన్‌ భగీరథకు కేంద్రం రూ.22వేల కోట్ల నిధులిచ్చి సాయం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర జీసీసీ చైర్మన్‌ ధరావత్‌ మోహన్‌గాంధీనాయక్‌, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి రాఘవరావు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీలో పాలకుర్తే ఫస్ట్‌
పాలకుర్తి రూరల్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే పాలకుర్తి ప్రథమ స్థానంలో ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంప్‌ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడే గుర్తింపు లభిస్తున్నదన్నారు. పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నాయకులు ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకేళ్లాలన్నారు. ఈ కుమార్‌, రజిత, వెంకటేశ్వర్‌రావు, పుల్లయ్య, రాములు, పుల్లయ్యలకు సీఎం రిలీఫ్‌ ఫం డ్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరిశ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీ న్‌, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, ఎండీ సర్వర్‌ఖాన్‌, ఎర్రబెల్లి రాఘవరావు, వీరమనేని యాకాంతారావు, రాపాక ఆశోక్‌, పోగు శ్రీనివాస్‌, వర్రె వెంకన్న, పుస్కూరి రాజేశ్వర్‌రావు, కళింగరావు, కడుదుల కర్ణాకర్‌రెడ్డి, కమ్మగాని నాగన్న, కాటబత్తిని రమేశ్‌, జంపాల ఆంజయ్య, వేణు, కత్తి సైదులు, తాళ్ల సోమనారాయణ, కల్వల భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

71

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles