రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Tue,November 12, 2019 02:27 AM

పాలకుర్తి రూరల్, నవంబర్ 11: రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎఫ్‌ఎస్‌సీఎస్ బ్యాంక్ చైర్మెన్ అడ్డూరి మాధవరావు అన్నారు. సోమవారం మండలంలోని విస్నూరులో ఎఫ్‌ఎస్‌సీఎస్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావుతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నకీర్త యాకయ్య, బుర్కకుమార్, ఎంపీటీసీలు యాకయ్య, పుస్కూరి కళింగరావు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, ఎండీ కేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సిబ్బంది పుస్కూరి మధుకర్‌రావు, ఐలినేని సోమేశ్వర్‌రావు రైతులు పాల్గొన్నారు. అలాగే కొడకండ్ల మండల కేంద్రంతోపాటు నర్సింగపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధ్యాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ ధరావత్ జ్యోతిరవీంద్రనాయక్ ప్రారంభించారు.

74

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles