మార్కెట్ కార్యదర్శికి వినతి


Tue,November 12, 2019 02:26 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్: స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్‌లో ప్రభుత్వ సంస్థలతోపాటు వ్యాపారులతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులు సోమవారం మార్కెట్ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తోట రమేశ్, సీపీఐ మండల కార్యదర్శి కూరపాటి విజయ్‌కుమార్ మాట్లాడుతూ చిల్లర కాంటాలను అరికట్టాలని, లైసెన్స్ ఉన్న వ్యాపారులు మాత్రమే క్రయవిక్రయాలు చేయాలన్నారు. మధ్య దళారీలను నివారించాలని, మార్కెట్‌లో రైతులకు మౌలిక సదుపాయాలను కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles