కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి


Tue,November 12, 2019 02:26 AM

రఘునాథపల్లి, నవంబర్ 11: రైతులు పండించిన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి కోరారు. మండలంలోని అశ్వరావుపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాంరెడ్డి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ సురేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాంరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకే రైతులకు అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులకు విక్రయించొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు ధాన్యంలో తేమశాతం తగ్గే వరకూ ఆరబెట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొల్లం అజయ్, ఏపీఎం సారయ్య, నాయకులు నామాల బుచ్చయ్య, కుర్ర రాజు, రైతులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles