బాలల హక్కుల రక్షణకు పాటుపడాలి


Tue,November 12, 2019 02:26 AM

జనగామ, నమస్తే తెలంగాణ: బాలల హక్కుల పరిరక్షణకు అందరూ పాటుపడాలని జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా సోమవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలు, చైల్డ్‌కేర్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు కలెక్టరేట్ వరకు బేటీ బజావో.. బేటీ పడావో నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఎదగాలన్నారు. అనంతరం విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు వివిధ రకాల పోటీలు నిర్వహించి జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల సీడీపీవోలు రమాదేవి, ఫ్లోరెన్స్, జయంతి, బాలరక్షాభవన్ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి, డీసీపీవో రవికాంత్, ఏసీడీపీవో పావని, జిల్లా చైల్డ్‌కేర్ సెంటర్ల ప్రతినిధులు, హెచ్చార్సీ కో ఆర్డినేటర్ జేరిపోతుల పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

48

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles