సీసీ కెమెరాలతోనే నేరాల నియంత్రణ: సీఐ


Tue,November 12, 2019 02:26 AM

లింగాలఘనపురం, నవంబర్ 11: నేరాల నియంత్రకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని సీఐ చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. లింగాలఘనపురంలో సోమవారం రాత్రి నిర్వహించిన జాగృతి పోలీస్ కళా జాత ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ ఇటీవల దేవరుప్పుల మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఓ మహిళను బెదిరించి మెడలోనుంచి గొలుసును లాక్కెళ్లిన వ్యక్తులను నేరం జరిగిన స్వల్ప వ్యవధిలోనే గుర్తించ గలిగామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ్ధతో ప్రజలకు చాలా దగ్గరవుతున్నామన్నారు. సైబర్‌నేరగాళ్లకు ప్రజలు తమ ఏటీఎం కార్డు నెంబర్లను, అకౌంటు నెంబర్లను, ఓటీపీ నెంబర్లను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇవ్వొద్దన్నారు. సమావేశంలో ఎస్సై సంతోషం రవీందర్, కళాకారులు విలియమ్, నాగమణి, వెంకన్న, రత్నాకర్, నారాయణ, విక్రమ్‌రాజ్, పీసీ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles