డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని..


Tue,November 12, 2019 02:25 AM

జనగామ రూరల్, నవంబర్11: నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తూ ఇద్దరు ముఠాసభ్యులు పట్టుబడిన ఘటన మండలంలోని మరిగడి శివారు తండాలో సోమవారం చోటుచేసుకుంది. గామస్తుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన సానబోయిన శివయ్య, హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన ఉమారాణి జనగామ మండలం మరిగడి శివారు కోటగుట్టతండా, బండతండాల్లో తిరుగుతూ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని నమ్మించి గ్రామస్తుల వద్ద ఇంటికో వెయ్యి చొప్పున వసూలు చేశారు.


ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్ ప్రతులను సైతం తీసుకున్నారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పలువురు గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని శివయ్య, ఉమారాణిని ప్రశించగా అసలు విషయం బయటపడింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు వారిపై చీటింగ్ కేసు నమోదు చేశామని, నిందితుల నుంచి రూ. 3200 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజేశ్‌నాయక్ తెలిపాడు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles