అన్ని రూట్లలో బస్సుల రవాణా


Tue,November 12, 2019 02:25 AM

జనగామ టౌన్ : జిల్లాలో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. ప్రతి గ్రామానికి ఆర్టీసీ సర్వీస్‌లను అధికారులు అందిస్తున్నారు. ఆర్టీసీ, రవాణాశాఖా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సమ్మె నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకొకుండా ఉండేందుకు బస్టాండ్, డిపో వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటుచేశారు. సమ్మె సోమవారం నాటికి 38వ రోజుకు చేరుకోగా 94 ఆర్టీసీ, 21 అద్దె బస్సులతో కలిపి మొత్తంగా 115 బస్సులు నడిచాయి. ఇదిలా ఉండగా ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముట్టడి చేపట్టగా వీఎస్‌ఆర్ రెడ్డి అనే కార్మికుడికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను జిల్లా ప్రధాన దవాఖానకు తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించారు. అలాగే ఎమ్మెల్యే, ఎంపీల ముట్టడి కార్యక్రమంలో పోలీసులకు ఆర్టీసీ కార్మికుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు కార్మికులను ఎక్కడిక్కడే అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles