ఆర్టీసీ పరుగులు


Mon,November 11, 2019 01:21 AM

-ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
-37వ రోజు 113 బస్సులు నడిపిన అధికారులు
-జిల్లాలోని అన్ని రూట్లలో తిరిగిన సర్వీసులు


జనగామ టౌన్, నవంబర్ 10 : ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 37 రోజులు గడిచినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ సిబ్బందితో బస్సులను యథావిధిగా పరుగులు పెట్టిస్తున్నది. దీంతో ప్రయాణికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ వారి గమ్యస్థానాలకు సాఫీగా చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జనగామ ఆర్టీసీ డిపోలో 125 బస్సుల్లో 91 ఆర్టీసీ, 22 అద్దె బస్సులతో 37 రూట్లలో కలిపి మొత్తంగా 113 బస్సులు నడిచాయి. అలాగే కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ నోడల్ ప్రత్యేక అధికారులు, డిపో డీఏం ముందస్తు చర్యలు చేపడుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా తాత్కాలిక బస్ సర్వీసులను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా డిపోలో రోజు వారీగా బస్సుల మరమ్మతుకు అవసరమైన సిబ్బందిని వెంటనే తీసుకువచ్చి రిపేర్ చేయించి రవాణాలో ఇబ్బందులు లేకుండా చూడాలని డిపో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇదిలాఉండగా ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం న్యాయం చేయాలని నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో డిపో, బస్టాండ్ ప్రాంతాల్లో పోలీసులు 24 గంటల పాటు సీసీ కెమెరాల నిఘాను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు అదనపు పోలీస్ బలగాలతో భారీ బందోబస్తును నిర్వహించారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles