రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Mon,November 11, 2019 01:20 AM

రఘునాథపల్లి, నవంబర్ 10 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభింస్తున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరను పొందాలని రైతులకు సూచించారు.


దీనిపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి ఏ-గ్రేడ్ క్వింటాల్‌కు రూ.1,835, బీ-గ్రేడ్‌కు రూ.1,815 మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో ధాన్యం విక్ర యించిన డబ్బులు జమవుతాయన్నారు. కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండలను తలిపిస్తున్నాయని, రైతులు యాసంగిలో పంటలు సాగుచేసుకోవాలని ఆయన అన్నారు. రైతులకు పంట పెట్టుబడి త్వరలోనే వస్తుందని, ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పోకల శివ కుమార్, జెడ్పీటీసీ మారపాక రవి, నాయకులు ఆకుల కుమార్, నామాల బుచ్చయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, మహేందర్‌రెడ్డి, మహిళా సంఘాల నాయకురాలు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

41

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles