ఘనంగా మిలాద్ ఉన్ నబీ


Mon,November 11, 2019 01:20 AM

జనగామ టౌన్, నవంబర్ 10 : మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఆదివారం జనగామలో ఘనంగా నిర్వహించారు. టీఎస్ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ న బీ వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రధాన ఆ స్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి వెస్ట్‌జోన్ జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ ఎస్ వినోద్‌కుమార్, సీఐ మల్లేశ్‌యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రా రంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ.. రక్తదానం చేయడం ద్వారా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మరొకరి ప్రాణాల ను కాపాడిన వారవుతారని అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి డీసీపీ, ఏసీపీ బ్లడ్ డొనేష న్ సర్టిఫికెట్లను అందజేశారు. అలాగే మైనార్టీ యు వజన నాయకుడు ఎండీ అజారుద్దీన్ ఆధ్వర్యం లో జిల్లా ప్రధాన ఆస్పత్రితో పాటు జనగామ మా తాశిశు సంరక్షణ కేంద్రంలో 150 మంది రోగుల కు, వృద్ధులు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో ఎండీ ఖాజా, ముజ్తఫిదుద్దీన్, జనగామ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గులాం సంధాని, అంకుషావలి, ఎండీ హఫీ జ్, తహసీన్, రెహ్మాన్, బల్లు, సమద్, మోహమిన్, జహంగీర్, షకీర్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles