నేటి నుంచి జీడికల్ జాతర


Mon,November 11, 2019 01:19 AM

లింగాలఘనపురం, నవంబర్ 10 : జిల్లాలో మరో భద్రాద్రిగా పేరుగాంచిన జీడికల్ జాతరను సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. జీడికల్‌లో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. 11వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే జాతరలో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణాన్ని ఈనెల 17న నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం రాత్రి 7 గంటలకు స్వస్తి వచనం, లక్ష్మీపూజ, ఆరగింపు తీర్థగోష్టి, మంగళవారం కార్తీక పౌర్ణమి పుష్కర స్నానాలు, స్వామివారి దర్శనం, బుధవారం నుంచి గురువారం వరకు నిత్యనిధి, శుక్రవారం అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ, నిత్యహవనం, గరుడపట అధివాసం, మంటప ద్వారణ, తోరణపూజ, శనివారం ధ్వజారోహణ, గరుడముద్ద, బలిహరణం, చాత్మర తీర్థ గోష్టి, నిత్యహవనం, దేవతాహ్వానం, భేరీపూజ, ఎదురుకోళ్లు, ఆరగింపు తీర్థ గోష్టి పూజలు ఉంటాయన్నారు.


ఆదివారం స్వామివారి కల్యాణం, సోమవారం నిత్యహవనం, తోరణపూజ, ఆరగింపు తీర్థ గోష్టి, మంగళవారం మహాపూర్ణాహుతి, బుధవారం నుంచి గురువారం వరకు నిత్యనిధి, శనివారం చక్రస్నానం, ఆదివారం స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, పండిత సత్కారంతో జాతర ముగుస్తుందని ఆమె వివరించారు. సమావేశంలో ఆలయ పూజారి వెంకటాచారి, సిబ్బంది కేకే రాములు భరత్‌కుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles