జనగామ, నమస్తే తెలంగాణ, నవంబర్ 09 : జనగామ పట్టణానికి జిల్లా కేంద్రానికి కావాల్సిన హంగులు సమకూర్చేందుకు ఇప్పటికే చౌరస్తా జంక్షన్ నుంచి నెహ్రూపార్క్ వ రకు విస్తరణ పనులు పూర్తి కావచ్చాయి. ఇక రైల్వేస్టేషన్ జంక్షన్ విస్తరణ, అభివృద్ధిపై మున్సిపల్ ప్రత్యేక అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. శనివా రం రైల్వేస్టేషన్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ ప నులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి కమిషనర్, కాంట్రాక్టర్‌కు సూచనలు చేశారు. ప్రధాన రహదారి విస్తరణ ప నులు పూర్తికావచ్చిన దృష్ట్యా ఇక కూరగాయల మార్కెట్, రైల్వేస్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో విస్తరణపై మున్సిపల్ అ ధికారులు శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. అమ్మబావి, పాతబీట్ బజార్రోడ్డు, పోలీస్‌స్టేషన్, నెహ్రూపార్క్ వరకు విస్తరణ సరిగ్గా జరిగిందా? లేదా? అన్నది మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు మరోసారి సరిచూసుకోవాలన్నారు. సెట్‌బ్యాక్ కంటే ముందుకు వచ్చిన నిర్మాణాలను యజమానులను ఒప్పించి తొలగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డుపై సెట్‌బ్యాక్ అయినప్పటికీ భవనంపై బాల్కని అలాగే వదిలేసిన ఇళ్లను పరిశీలించి తగిన సమయం ఇచ్చిన అనంతరం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన డ్రైనేజీ ప నులు వందశాతం పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మసీద్ రోడ్డు విస్తరణకు వెంటనే పనులు మొదలుపెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. దీనిపై పట్టణ ప్రణాళిక వి భాగం అధికారులు సంబంధిత వ్యాపారులకు తెలియజేయాలని ఆదేశించారు. గతంలో తయారుచేసిన మాస్టర్ ప్లా న్ ప్రకారం రైల్వేస్టేషన్ జంక్షన్ పనులు తర్వితగతిన పూర్తిచేయాలని, రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ ఫిర్యాదు రాకుండా చూడాలన్నారు. జంక్షన్‌కు సం బంధించిన పూర్తి నివేదికను ఈనెల 11న తనకు అందించాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రవీందర్ యాదవ్, ఏఈ శాంతిస్వరూప్, టౌన్‌ప్లానింగ్ ఇన్చార్జి అధికారి ఖురేషి తదితరులు ఉన్నారు.