కోలాహలంగా బస్టాండ్


Sat,November 9, 2019 05:57 AM

-35వ రోజు యథావిధిగా ప్రయాణం
-116 బస్సులు నడిపించిన ఆర్టీసీ అధికారులు
-49 బస్సుల తనిఖీ
జనగామ టౌన్, నవంబర్ 08 : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి శుక్రవారం 35వ రోజుకు చేరింది. అయినప్పటికీ విద్యార్థులతోపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో జనగామ బస్టాండ్ కోలాహలంగా మారింది. ఈ నేపథ్యంలో జనగామ డిపో నుంచి 116 బస్సులు 37 రూట్లలో యథావిధిగా నడిపినట్లు డిపో అధికారులు తెలిపారు. ఇందులో 93 ఆర్టీసీ, 23 అద్దె బస్సులున్నాయని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాలతో డీఏం ధరంసింగ్ మూలన పడిన బస్సులకు మరమ్మతు చేయించారు. అదేవిధంగా జిల్లా రవాణాశాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 49 బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలువురు తాత్కాలిక కండక్టర్, డ్రైవర్లకు సూచనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు జనగామ డిపోలో డ్యూటీలో చేరిన ఆరుగురిలో శుక్రవారం ఇద్దరు విధులకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని జనగామ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసుకున్న దీక్షా శిబిరం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున కార్మికులను పోలీసులు అరెస్టు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.

61

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles