వ్యభిచారం కేసులో ఆరుగురు రిమాండ్


Sat,November 9, 2019 05:56 AM

-వివరాలు వెల్లడించిన సీఐ మల్లేశ్ యాదవ్
జనగామ టౌన్, నవంబర్ 08 : జిల్లా కేంద్రంలో వ్యభిచారం నేరంలో పట్టుబడిన ఆరుగురిని రిమాండ్‌కు తరలించినట్లు జనగామ సీఐ మల్లేశ్‌యాదవ్, ఎస్సై రవికుమార్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 రోజుల నుంచి జిల్లా కేంద్రంలోని యశ్వంతపూర్ రోడ్డుతో పాటు గిర్నిగడ్డ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ఫ్యామిలీలతో ఉంటామని ఇండ్లను కిరాయికి తీసుకొని వ్యభిచారాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన జనగామ పోలీసులు ఐడీ పార్టీ పోలీసులతో నిఘా ఉంచి ఎట్టకేలకు గురువారం రాత్రి వ్యభిచార ముఠా కేసును చేధించారు.


ఇందులో జనగామ జిల్లాకు చెందిన జీ జశ్వంత, ఎం బుచ్చమ్మ, హైదరాబాద్‌కు చెందిన కే మల్లేశ్వరి, బీ జ్యోతి హైదరాబాద్, ఆంధ్రాప్రాంతాల్లో అమాయకులుగా ఉన్న నిరుపేదలను వ్యభిచారం కూపిలోకి లాగి, ఈ దందాను జోరుగా సాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా పై నలుగురితో పాటు ఏ ఆంజనేయులు, జీ నరేందర్ సైతం పోలీసులకు పట్టుబడడంతో ఈ నేరానికి చెందిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తంగా పట్టుబడిన 9 మందిలో ఆరుగురిని రిమాండ్‌కు తరలించగా, మరో ముగ్గురు మహిళలను వరంగల్‌లోని మైహోం కేంద్రానికి తరలించారు. కాగా ప్రజలు సైతం ఎవరికి పడితే వారికి ఇండ్లను కిరాయిలకు ఇవ్వొద్దని సూచించారు. అనుమానం వస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

100

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles