నిరుద్యోగులకు రుణాలు అందేలా చూడాలి


Fri,November 8, 2019 04:12 AM

జనగామ టౌన్ : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిస్ జనరేషన్ ప్రో గ్రాం(పీఎంఈజీపీ)లో అన్నివర్గాలకు చెందిన అ ర్హులైన నిరుద్యోగ యువతకు రుణాలు అందేలా చూడాలని బ్యాంకర్లను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం లో బ్యాంకర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులతో పాటు 2018-19 సంవత్సరానికి నమోదు చేసుకున్న వారిలో తిరస్కరణకు గురైన 33 దరఖాస్తు ల్లో అర్హత ఉన్నవారిని లెక్కలోకి తీసుకోవాలని ఆ దేశించారు. ప్రస్తుతం దరఖాస్తులు చేసుకున్న వా రిలోనూ అర్హత కలిగి ఉన్న అభ్యర్థ్ధులకు సంబంధిత ప్రాజెక్టులపై అవగాహన, అనుభవాలు తప్పనిసరిగా పరిశీలించాలని, గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి అభ్యర్థులు ఎలాంటి తప్పిదాలు లేకుండా సరిచూసుకోవాలని ప్రత్యేకంగా తెలియజేశారు.


దరఖాస్తులు చేసుకునే సమయంలో అభ్యర్థుల నుంచి సెల్‌ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ తీసుకుని తిరస్కరణకు గురైన వారి దరఖాస్తును ఎందుకు తిరస్కరించారనే విషయాన్ని వివరంగా చెప్పాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. అలాగే ప్రాజెక్టులపై అవగాహన ఉన్నవారికే అప్పటి సాధ్యాసాధ్యాల ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారని, ఇందుకు కనీస విద్యార్హత 8వ తరగతి పూర్తయి 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే దరఖాసులు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో రాంరెడ్డి, ఇండస్ట్రియల్ జీఎం రమేశ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొర్పేలియస్ ఉన్నారు.

74

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles