రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


Thu,November 7, 2019 02:12 AM

బచ్చన్నపేట, నవంబర్ 06 : రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీపీ నాగజ్యోతి అన్నారు. బుధవారం మండలంలోని బండనాగారం, చిన్నరామన్‌చర్ల, ఇటిక్యాలపల్లి, నారాయణపూర్, పడమటికేశ్వాపూర్, కొన్నె గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు శివరాత్రి కవిత, ఖలీల్‌బేగం, రవీందర్‌రెడ్డి, గిద్దెల రమేశ్, నాగిరెడ్డి రజిత, వేముల వెంకట్‌లతో పాటు ఎంపీటీసీ సభ్యులు లలిత, సక్కుబాయి, కనకయ్యలతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, మండల నాయకులు గిరబోయిన అంజయ్య, బావండ్ల కృష్ణంరాజు, రాజనర్సు , శ్రీనివాస్‌రెడ్డి, జోగిరెడ్డి, బాపురెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకట్, సీసీలు నర్సిములు, లక్ష్మి, తిరుమల, గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులు, వీవోఏలు పాల్గొన్నారు.

58

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles