డిపోలోని అన్ని బస్సులు నడపాలి


Thu,November 7, 2019 02:11 AM

జనగామ టౌన్ : జనగామ డిపోలోని అన్ని బస్సులను సమయపాలనతో నడపాలని డిపో అధికారులను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం జనగామ బస్టాండ్, డిపోలో కలెక్టర్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన డీఎం ధరంసింగ్, ఎంవీఐ సాయిచరణ్‌తో మాట్లాడారు. బస్సులను గ్యారేజీల్లో ఉంచకుండా వెంటనే రిపేర్ చేయించాలని సూచించారు. బస్సులు నడపని అద్దె బస్సుల నిర్వాహకులతో మాట్లాడి యజమానులకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. అనుభవం ఉన్న డ్రైవర్లను మాత్రమే విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా 33వ రోజు 91 ఆర్టీసీ, 24 అద్దె బస్సులు కలిపి మొత్తంగా 115 బస్సులు యథావిధిగా నడిచినట్లు డిపో అధికారులు వెల్లడించారు. జనగామ నిడిగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిగా మరొకరు గాయాలతో చికిత్సపొందుతున్న సంఘటనపై జిల్లా రవాణాశాఖ, ఆర్టీసీ డీఏం, పోలీస్‌శాఖ దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మికుల కుటుంబాలతో డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఈమేరకు పోలీసులు బస్టాండ్, డిపో ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles