విగ్రహాలను గ్రామానికి తీసుకురావాలి


Thu,November 7, 2019 02:11 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : గ్రామంలోని నాగులమ్మ ఆలయం వద్ద ఉన్న పురాతన విగ్రహాలను గ్రామస్తులకు తెలియకుండా సర్పంచ్ అజయ్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకొని పురావస్తు శాఖకు అప్పగించడం తగదని, వెంటనే ఆ విగ్రహాలను గ్రామానికి తీసుకురావాలని అఖిలపక్ష నాయకుడు కట్టయ్య పేర్కొన్నారు. బుధవారం ఇప్పగూడెంలో ఉపసర్పంచ్ పరశురాములు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల క్రితం గ్రామానికి చెందిన ఓ రైతు దుక్కి దున్నుతుండగా నాగలికి తగిలి పురాతన విగ్రహాలు బయటపడ్డాయని తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆ విగ్రహాలను స్థానిక నాగులమ్మ దేవాలయం వద్దకు తరలించారన్నారు. త్వరలో వాటికి గుడి నిర్మించేందుకు ఇంటింటికీ విరాళాలు సైతం వేసుకుంటున్నట్లు తెలిపారు. కాగా సర్పంచ్ అజయ్‌రెడ్డి గ్రామస్తులకు తెలియకుండా పురావస్తు శాఖకు విగ్రహాలు ఉన్నాయని సమాచారం చేరవేయడంతో వారు మంగళవారం రాత్రి విగ్రహాలను తరలించారు. తిరిగి ఆ విగ్రహాలను గ్రామానికి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు రాంనర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ యాకయ్య, గ్రామస్తులు వెంకటస్వామి, శంకర్, బుచ్చయ్య, అంజనేయులు, కుమారస్వామి, కోటి, రాజయ్య పాల్గొన్నారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles