విధుల నిర్లక్ష్యంపై డీఈవో సీరియస్


Thu,November 7, 2019 02:11 AM

దేవరుప్పుల : పలుమార్లు తనిఖీలు చేసి హెచ్చరించినా ఉపాధ్యాయులు తమ పద్ధతి మార్చుకోవడంలేదని, ఇకపై చర్యలు తప్పవని డీఈవో యా దయ్య అన్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలను బుధవారం డీఈవో యాదయ్య తనిఖీ చేసి పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేయర్ చేయిస్తున్న సమయానికి సైతం ఆరుగురు ఉపాధ్యాయులు రాకపోగా అనంతరం గంట వరకు ఒక్కొక్కరుగా రావడంపై డీఈవో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మరోసారి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనంతరం విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. పాఠశాల ఆవరణను, వంట గదిని, స్టోర్ రూంను పరిశీలించారు. రెండు రోజుల క్రితం జెడ్పీటీసీ, ఎంపీపీ పాఠశాలను తరిఖీ చేసి అనేక అవకతవకలను గుర్తించి లిఖిత పూర్వకంగా డీఈవోకు లేఖ సమర్పించినా తీరు మారకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తంచేశారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles