ముగిసిన లీగ్ దశ కబడ్డీ పోటీలు


Thu,November 7, 2019 02:11 AM

పాలకుర్తి : తెలంగాణ 65వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా ప్రజాప్రరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో లీగ్ దశ ముగిసింది. లీగ్ దశలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగగా 8 జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఆతిథ్య ఉమ్మడి వరంగల్ బాలబాలికల జట్లు అన్ని జట్లపై విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. బాలికల విభాగంలో ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు.., బాలుర విభాగంలో వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ జట్లు ముందడుగు వేశాయి. రెండో రోజు పోటీలను జెడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మదార్ క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర కబడ్డీ నిర్వాహకులు రామారావు, ప్రవీణ్‌రెడ్డి, రసూల్, ప్రవీణ్‌కుమార్ క్రీడలను పరిశీలించారు. కాగా బమ్మెర వాసి భిక్షపతి జాతీయస్థాయికి అర్హత సాధించే 30 మంది క్రీడాకారులకు ట్రాక్‌సూట్‌లను కానుకగా అందజేశారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles