ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్‌ విధానం భేష్‌


Wed,November 6, 2019 02:30 AM

- రాష్ట్ర ఎన్‌క్వాస్‌ మెంట్‌ క్వాలిటీ జేడీ డాక్టర్‌ రజిని
- జిల్లా ఎంసీహెచ్‌లో


జనగామ టౌన్‌, నవంబర్‌ 05: జనగామ ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్‌ విధానం బాగుందని రాష్ట్ర ఎన్‌క్వాస్‌ మెంట్‌ క్వాలిటీ జేడీ డాక్టర్‌ రజిని తెలిపారు. జిల్లా ప్రధాన దవాఖాన, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఎన్‌క్వాస్‌ మెంట్‌ క్వాలిటీ బృందం తనిఖీలు చేపట్టింది. ఈతనిఖీల్లో ముందుగా దవాఖానలోని ఓపీ విభాగంతోపాటు ల్యాబ్‌, రక్తనిధి, ఆపరేషన్‌ థియేటర్‌, డాక్టర్స్‌ డ్యూటీ గదులు, రోగుల బెడ్స్‌ను తనిఖీలు చేపట్టి పలు అంశాలపై మార్పులు చేసుకోవాల్సిందిగా వైద్యులకు సూచించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా భద్రాచలం, ఖమ్మం, సిరిసిల్ల, బాన్సువాడతోపాటు జనగామ జిల్లా దవఖానలు జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేట్‌ కోసం పోటి పడుతుండడంతో ఈ బృందం జనగామ దవాఖానలో తనిఖీలు చేసినట్లు దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్‌ రఘు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌క్వాస్‌ బృందం 18 అంశాలపై నాణ్యత పరిమాణాలను పరిశీలించారన్నారు. వారి నివేదిక ప్రకారం జాతీయ స్థాయికి ఎంపికైన దవాఖానల అభివృద్ధి, వైద్యుల ప్రోత్సాహనికి మూడేళ్లపాటు ఒక్కో సంవత్సరానికి రూ.25 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

అనంతరం వైద్యులు, వైద్యసిబ్బందితో ఈ బృందం సమీక్ష నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఇందులో ఆర్‌ఎంవో డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, క్వాలిటీ కంట్రోల్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌, వైద్యులు డాక్టర్‌ మహేశ్‌, వనం శ్రీనివాస్‌, మురళీకృష్ణా, శ్రీధర్‌, బాలాజీ, జ్యోత్స్న, అమృతం శ్రీకాంత్‌, శ్రవంతి, నరేశ్‌బాబు, నరేందర్‌, స్వప్న, నర్సులు ఇంద్రా, శేలిష్టనా, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ కే నరేందర్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

63

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles