పల్లె ప్రగతి పరుగులు పెట్టాలె


Wed,November 6, 2019 02:26 AM

జనగామ, నమస్తేతెలంగాణ: ‘ప్రగతి ప్రణాళిక పనుల స్ఫూర్తితో గ్రామాల్లో నిరంతరం అభివృద్ధి పనులు చేపట్టాలని, రాష్ట్రంలో జనగామ జిల్లాను అగ్రస్థానంలో నిలుపాలని, అన్ని రంగాల్లో ముం దుండే ఆదర్శ పంచాయతీలకు అదనపు నిధులు కేటాయించి సర్పంచులు, అధికారులను సత్కరిస్తా’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శా ఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో మంగళవారం శాసన మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రా జయ్య, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి చేతుల మీదుగా జిల్లాలోని 27 గ్రామ పంచాయతీలకు వివిధ కంపెనీల ట్రాక్టర్లను అందజేశారు. ఈసందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో తొలుత తహసీల్దార్‌ విజయారెడ్డి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో కలెక్టర్‌ సహా జిల్లా అధికారులు, గ్రామ కార్యదర్శులు బాగా పనిచేశారని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకునడిపిస్తున్నారని, సర్పంచులు స్వార్థం వీడి గౌరవం కోసం పట్టుదలతో పనిచేసి గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ట్రాక్టర్ల పంపిణీతో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడాలని, తడిపొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. హరితహారానికి ప్రతి గ్రామపంచాయతీ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. మన కోసం అన్ని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మనందరం అండగా నిలవాలని, రాష్ర్ట ప్రభుత్వం గ్రామపంచాయతీలకు బడ్జెట్‌లో రూ.2714 కోట్లను కే టాయించిందని తెలిపారు. రాష్ట్రంలోని 12వేల గ్రామపంచాయతీలకు ఏటా 4,06 8 కోట్ల ఇస్తున్నామని, తెలంగాణలో అమలయ్యే పథకాలను కేంద్రం అధ్యాయనం చేసి ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తుందని, కానీ మనకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదన్నారు. మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ గృహాలను తనిఖీలు చేసే అధికారం ఎంపీపీలు, జెడ్పీటీసీలకు కట్టబెట్టే బిల్లు త్వరలో అసెంబ్లీ పెట్టబోతున్నామని ప్రకటించారు.


రూ.100కోట్లతో తొర్రూరు అభివృద్ధి
తొర్రూరు, నమస్తే తెలంగాణ: ఏడాదిలో తొర్రూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తానని, పట్టణంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తొర్రూరు మున్సిపాలిటీలో రూ.40కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో తలపెట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్న 600 డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పనులకు మంగళవారం కలెక్టర్‌ సీహెచ్‌ శివలింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.5కోట్ల నిధులతో ఏసీ, లిప్ట్‌తో కూడిన ఆధునిక హంగులు ఉన్న కూరగాయలు, మాంసాహార విక్రయాల కోసం ఐదు అంతస్తులతో గాంధీ పార్క్‌ ఆవరణలో ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌ను నిర్మించే పనులను ప్రారంభించామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం తర్వాత తొర్రూరులోని ఎస్సీ కాలనీలోని అత్యధికంగా 200 డబుల్‌బెడ్‌రూం గృహాలను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఆరు నెలల్లో ఈ కాలనీలో గృహ నిర్మాణాలు పూర్తి చేసి రాష్ర్టానికే రోల్‌మోడల్‌గా నిలుపాలని అధికారులను ఆదేశించారు.

దళారులను ఆశ్రయించి దగాపడొద్దు
రాయపర్తి: రైతులు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం దళారులను ఆశ్రయించి దగాపడొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నేతృత్వంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ పరిధి మండలంలోని మైలారం గ్రామ శివారులోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్‌ మిల్లులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. రైతుబిడ్డ అయిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతోనే అనేక సంస్కరణలు, అధునాతన విధానాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రైతన్నలు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే డిమాండ్‌తో పార్లమెంట్‌ సభ్యులను ఢిల్లీకి పంపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆయన వివరించారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles