రంగప్ప చెరువులో ఆరు ఇళ్లు సీజ్


Tue,November 5, 2019 03:58 AM

జనగామ, నమస్తే తెలంగాణ : పట్టణంలోని రంగప్పచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని గోకుల్‌నగర్‌కాలనీలో వెలిసిన అక్రమ నిర్మాణాలు, ఇంటి ద్వారాలు, కిటికీల కు మున్సిపల్ అధికారులు సోమవారం కార్డుబోర్డు చెక్కలు కొట్టి సీజ్ చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో నిర్మాణంలో ఉన్న భవనంలో నివాసముంటున్న కుటుంబాన్ని ఖాళీ చేయించి అధికారులు సీజ్ చేశారు. దీంతో గర్భణీ సహా కుటుంబ సభ్యులందరూ అనివార్యంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. నా లుగు రోజులుగా ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, ఇళ్ల సీజ్ పర్వం కొనసాగుతున్నది.


రంగప్పచెరువు శిఖం గోకుల్‌నగర్‌లో మున్సిపల్ అనుమతులు పొందిన ఇంటి యజమానులకు ఖాళీ చేయాలని షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ ఇళ్లలో నివాసముండడం ప్రమాదకరమంటూ యుద్ధప్రాతిపదికన సీజ్ చేశారు. బతుకమ్మకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించుకున్న ఓ ఇంటి గోడను పోలీసుల సాయంతో రెండు వైపులా కూల్చివేశారు. బాధితులు మాత్రం తాము అన్ని అనుమతులు తీసుకున్నాకే ఇంటి నిర్మాణం చేసుకుంటే ఇప్పడు చెల్లదంటూ నోటీసులివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

70

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles