ప్రజావాణి వినతులను పరిష్కరించాలి


Tue,November 5, 2019 03:58 AM

-జిల్లా జాయింట్ కలెక్టర్ ఓజేమధు
జనగామ, నమస్తే తెలంగాణ, నవంబర్ 04 : ప్రజావాణిలో స్వీకరిస్తున్న దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జేసీ ఓజే మధు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 63 దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించగా, జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం చేసుకుంటున్న దరఖాస్తులను పరిశీలించాలని, అలాగే దరఖాస్తుల్లో పేర్కొన్న సమస్యలు పరిష్కరిస్తే ఫిర్యాదు దారులు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటారన్నారు. అనంతరం గత వారంలో స్వీకరించిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారు? పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఎన్ని? వాటికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా సోమవారం స్వీకరించిన దరఖాస్తుల్లో మద్యం దుకాణాలను నియంత్రించాలని, భూ తగాదాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు వంటి అంశాలపై వినతులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌వో మాలతి, కలెక్టరేట్ ఏవో విశ్వప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఫిర్యాధులపై అలసత్వం వహించొద్దు : ఆర్డీవో రమేశ్
స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ : ప్రతి సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఆర్డీవో రమేశ్ ఆదేశించారు. సోమవారం మండలకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 18 ఫిర్యాదులను స్వీకరించామన్నారు. కార్యక్రమంలో డీటీ శంకర్, సిబ్బంది అవినాష్, వీఆర్‌ఏ అనిల్ పాల్గ్గొన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles