మహదేవపూర్, నవంబర్ 4: లక్ష్మీ (మేడిగడ్డ)బరాజ్లోక్రమంగా నీటి ప్రవాహం తగ్గుతున్నది. సోమవారం 10 గేట్లను ఎత్తి నీటిని తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ప్రాణహితలో వరద ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తున్నది. దీంతో నీరు లక్ష్మీ బరాజ్‌కు చేరుతుండగా, అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం 13 గేట్లను ఎత్తగా, సోమవారం నీరు తగ్గుముఖం పట్టడంతో మూడు గేట్లను మూసి 10 గేట్ల ద్వారా దిగువకు తరలిస్తున్నట్లు తెలిపారు. బరాజ్‌లో 95.65 మీటర్ల ఎత్తులో 5.566 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 70 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.