ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం


Wed,October 23, 2019 01:33 AM

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్‌/చిలుపూర్‌/జఫర్‌ఘడ్‌, అక్టోబర్‌ 22: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ రూ. 14.64 లక్షలు, అలాగే చిలుపూర్‌ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన పేరాల సమతకు రూ.28వేలు, జఫర్‌ఘడ్‌ మండలంలోని కూనూరు గ్రామానికి చెందిన లావణ్యకు రూ.30 వేలు, ఒబులాపూర్‌ గ్రామానికి చెందిన శాంతమ్మ కు రూ.28 వేలు (సీఎంఆర్‌ఎఫ్‌), అలాగే లింగాలఘనపురం మండలానికి చెందిన 20 మందికి రూ.20.20 లక్షల కల్యాణలక్షి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్ధానిక సర్పంచ్‌, సర్పంచ్‌ల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు తాటికొండ సురేశ్‌కుమార్‌ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ జనగామ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల మినహా నియోజకవర్గంలోని మల్లికార్జునస్వామి, చిలుపూర్‌, జీడికల్‌ వీరాచల ఆలయం, శ్రీతిరుమలనాథ స్వామి దేవాలయం చైర్మన్ల ఎన్నికకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. చైర్మన్‌తోపాటు ఇద్దరు చొప్పున డైరెక్టర్లను ఎన్నుకుంటారని ఆయన తెలిపారు. ఈ నెల 24న ధర్మసాగర్‌ మండలంలోని శ్రీమార్కెండయ, రాజవరం గ్రామంలో ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభిస్తామన్నారు.


25న జనగామ జిల్లా స్థాయిలో స్టేషన్‌ఘన్‌ఘన్‌పూర్‌లో 123 మంది ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్‌ మేళానిర్వహిస్తున్నట్లు, కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ లచ్చిరాంనాయక్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీలు మారపాక రవి, బేబి, అజయ్‌కుమార్‌, ఎంపీపీలు కందుల రేఖగట్టయ్య, నిమ్మ కవిత, మండల పార్టీ అధ్యక్షుడు గట్టు రమేశ్‌, ఆకుల కుమార్‌, ఉపసర్పంచ్‌ నీల ఐలయ్య, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, మునిగల రాజు, దయాకర్‌, బంగ్లా శ్రీను, కుంభం కుమారస్వామి, మారెపల్లి ప్రసాద్‌, మల్లేశ్‌, జగన్‌, కుమార్‌, వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో చిలుపూర్‌ ఆలయ మాజీ డైరెక్టర్‌ గజ్జెల దామోదర్‌, జనగామ యాదగిరి, తాళ్లపెల్లి సంపత్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు రాజన్‌బాబు, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ, వైస్‌ ఎంపీపీ కనుకయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుజ్జరి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రాజయ్యకు జీపీ కార్మికుల సన్మానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు జీ వో 51 విడుతల చేస్తూ నెలకు రూ. 8.500 వేతనం చెల్లంచడంపై హర్షం వ్యక్తం చేసూ,్త ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌కేవీ ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ మేజర్‌ గ్రామ పం చాయతీ కార్మికులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని వినతి
మండలంలోని తాటికొండ గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజయ్యకు వినతిపత్రం అందజేశారు. వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు.

72

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles