పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య


Tue,October 22, 2019 02:29 AM

బచ్చన్నపేట, అక్టోబర్ 21 : పురుగుల మందుతాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కేశిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్‌రావు కథనం ప్రకారం.. జనగామ మండ లం వడ్లకొండకు చెందిన గోనె శ్రీను (30)కు, బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లికి చెందిన చామనబోయిన లక్ష్మయ్య కూతురు యమునతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. శ్రీను భార్యాపిల్లలతో కలిసి జనగామలో ఉంటూ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న శ్రీను తన అత్తామామలతో గొడవ పడి తన పిల్లలతో ఈ నెల 20న కేశిరెడ్డిపల్లికి వచ్చాడు. అదే రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని శ్రీను బావమరిది కుటుంబసభ్యులకు సమాచారం అందించి, వెంటనే చికిత్సనిమిత్తం జనగామ ఏరియా దవాఖానకు తరలించాడు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ శ్రీను మృతి చెందాడు. మృతుడు తండ్రి గోనె వెంకట య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శ్రీను మృతికి అతడి బావమరిది రాజుపై అనుమానం ఉందని వెంకటయ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై రంజిత్‌రావు తెలిపారు.


ఉరేసుకుని యవతి..
రఘునాథపల్లి : ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కోడూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం కథనం ప్రకారం.. కోడూరుకు చెందిన దామెర సత్తమ్మ-అబ్బయ్య దంపతుల కూతురు రాధిక (18) ఇటీవల ఇంటర్‌లో ఫెయిలైంది. అప్పటి నుంచి ఇంట్లోనే తల్లిదండ్రులతో వ్యవసాయ పనులకు వెళ్లేది. ఈక్రమంలో రెండు రోజు ల నుంచి రాధికకు జ్వరం రావడంతో ఇంట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులు సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లి పొద్దుపోయాక ఇంటికొచ్చే సరికి చున్నీతో దూలానికి ఉరేసుకుని రాధిక కనిపించడంతో వారు లబోదిబోమంటూ బోరున విలపిస్తుండడంతో ఇరుగు పొరుగు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంటర్‌లో ఫెయిలైనందున మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందా? మరేమైనా కారణాలున్నాయా? అనే అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

74

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles