పాలకుర్తి చెరువు మత్తడికి గండి


Tue,October 22, 2019 02:29 AM

పాలకుర్తి : రైతులకు జీవనాధారమైన పాలకుర్తి చెరువుకు వరద ఉధృతి పెరగడంతో కట్ట ప్రమాదపుటంచున ఉన్న నేపథ్యంలో మత్తడికి గండి పెట్టారు. సోమవారం సర్పంచ్ వీరమనేని యాకాంతరావు దేవాదుల డీఈపీ రాజు ఆధ్వర్యంలో చెరువు మత్తడికి గండి పెట్టారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టి పాలకుర్తి చెరువును రిజర్వాయర్‌గా మార్చారన్నారు. కానీ కాంట్రాక్టర్ చెరువు మత్తడి కింది భాగంలో రాయి సోలింగ్ తొలగించి పనులను నిలిపి వేసినట్లు చెప్పారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరద ప్రవాహం వల్ల చెరువు నిండిపోయి ప్రమాదం జరిగే పరిస్థితి ఉండంటంతో మత్తడికి గండి పెట్టాల్సి వచ్చిందన్నారు. కాకతీయుల పాలనలో నిర్మించిన పాలకుర్తి చెరువు పనులను సంబంధిత కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని రిజర్వాయర్ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ యాకాంతరావు కోరారు. కార్యక్రమంలో బండి కిరణ్‌కుమార్, గజ్జి సంతోశ్‌కుమార్, కత్తుల యాకయ్య, కమ్మగాని మధు, కడుదల విష్ణువర్ధన్‌రెడ్డి, కమ్మగాని అశోక్, బండి రాజు, మామిండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

77

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles