ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌కు చర్యలు తీసుకోవాలి


Mon,October 21, 2019 05:00 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ : స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేస్టేషన్‌లో శాతవాహన, పద్మావతి, గౌతమి, మచిలిపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా, మార్గమధ్య స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలో ఆదివారం ఆయనకు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనస్వాగతం పలికి, వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు వెంకట్రాంనర్సయ్య, నాయకులు యాద శ్రీనివాస్, తెల్లాకుల రామకృష్ణ, సరాబు ఆంజనేయులు, పాలకుర్తి సోమశేఖర్, గుండెటి సంపత్, పీ శ్రీనివాస్, ఎండీ దస్తగిరి, కే లక్ష్మీనారాయణ, ఇమ్మడి రామేశ్వర్, తుమ్మనపల్లి రవికిరణ్, ఐత ప్రభాకర్, తుమ్మనపల్లి రవికిశోర్ పాల్గొన్నారు.

71

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles