విలువలను బోధించేవి వేమన పద్యాలు


Mon,October 21, 2019 05:00 AM

-కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్
సిద్ధార్థనగర్, అక్టోబర్20: సామాజిక మానవతా విలువలను ప్రబోధించేవి వేమన పద్యాలు.. అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ అన్నారు. వడ్డేపల్లిలోని టీచర్స్‌కాలనీ ఫేజ్-1 కమ్యూనిటీహాల్‌లో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లంపట్ల నాగేశ్వర్‌రావు జన్మదిన వేడుకల సందర్భంగా కళాసాహితీ, సామాజిక సేవారంగం మిత్రుల సమ్మేళనం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై డోలి రాజలింగం ఆర్థిక సహకారంతో ముద్రించిన వేమన పద్యరత్నాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంపశయ్య నవీన్ మాట్లాడుతూ మానవ సంబంధాలను ఆత్మీయ అనుబంధాలుగా మార్చి సమాజ అభ్యుదయానికి ఇలాంటి సమ్మేళనాలు ఎంతో తోడ్పడుతాయని అన్నారు.


ప్రముఖ కవి, రచయిత రామాచంద్రమౌళి మాట్లాడుతూ సమాజహితాన్ని కోరేది సాహిత్యమని, కళా సృజనలో వరంగల్ కవులు కళాకారుల ఘనత ఎన్నదగినదని అంటూ అందులో ఐదు దశాబ్దాలుగా వల్లంపట్ల కృషి ఎంతో ఉందని కొనియాడారు. అనంతరం కవి రామాచంద్రమౌళిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇటీవల ప్రజాకవి కాళోజీ పురస్కారం అందుకున్న ప్రముఖ కవి బిల్లా మహేందర్, సాదుల సురేశ్, పైడి, నారాయణ, నాగబాబు, రాంరెడ్డి, డాక్టర్ పుల్లయ్య, రఘుపతిరెడ్డి, రతన్‌సింగ్, ఆల్‌పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య, ప్రొఫెసర్ కృష్ణమాచారి, రచయిత్రి రామలక్ష్మి, ఉపేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, సూరయ్య, సురేశ్, రాజేశ్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles