రంగప్ప చెరువుకు జలకళ


Sun,October 20, 2019 04:01 AM

జనగామ, నమస్తేతెలంగాణ, అక్టోబర్ 19 : జనగామ పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన రంగప్పచెరువు జలకళను సంతరించుకున్నది. చెరువులోకి గోదావరి జలాల చేరిక జోరుగా కొనసాగుతున్నది. ఇప్పటికే సగానికి పైగా నీరు చేరడంతో మొన్నటి వరకు వెలవెలబోయిన చెరువు ఇప్పుడు నీటితో కళకళలాడుతుంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవతో పట్టుబట్టి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటల్లోకి గోదావరి జలాలు అందించాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నారు. ఈక్రమంలోనే రంగప్ప చెరువును అలుగు పారే లా పూర్తి నీటి మట్టంతో నింపాలన్న పట్టణ ప్రజలు, రైతుల కోరిక మేరకు ఎమ్మెల్యే ఆదేశాలతో దేవాదుల అధికారులు ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి మల్లన్నగండి, బొమ్మకూరు, తుకుంబాయి, వెంకిర్యాల, గోపరాజుపల్లి మీదుగా పసరుమడ్ల, శామీర్‌పేట చెరు వు ద్వారా పట్టణంలోని రంగప్పచెరువులోకి నీటిని మళ్లిస్తున్నా రు. ప్రస్తుతం చెరువులోకి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో మరో వారంరోజుల్లో మత్తిడి పోస్తుందని టీఆర్‌ఎస్ నాయకుడు, ఆయకట్టు రైతులు వె న్నం సత్యనిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదేశంతో కట్టపై ఉన్న ముళ్ల పొదలు, ఇతర చెత్తాచెదారాన్ని పూర్తిస్థాయిలో జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకుడు పంతులు ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో శనివారం రంగప్ప చెరువు కట్టపై మత్స్యకారులతో కలిసి శ్రమదానంతో ముళ్లపొదలు, తుమ్మలు, పి చ్చిమొక్కలు తొలగించారు. కార్యక్రమంలో శీలం కిష్టయ్య, శీలం నాగయ్య, నర్సింహులు, పూస ర వి, రాజు, పుట్ట రామకృష్ణ, చందు, రాయారపు బిక్షపతి, మం గ బీరయ్య, మంగ సంపత్, మనుపాటి ఆంజనేయులు, నిడిగొండ మహేందర్, కర్రె సత్తయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

77

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles