రంగు మారుతున్న తెల్లబంగారం


Sun,October 20, 2019 04:00 AM

పాలకుర్తి , అక్టోబర్19: తెల్లబంగారంపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఈ సారి నిరాశే మిగిలింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు పత్తి రంగు మారుతున్నది. పత్తి కాయలు సకాలంలో విచ్చుకోకపోవడంతో పత్తి తీసేందుకు వీల్లేకుండా ఉండడంతో రైతులు ఏకంగా కాయలు కోసుకొచ్చి ఇంటి వద్దనే తీసుకుంటున్నారు. వర్షాలకు కాయలు మురిగిపోవడం, పూత రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులకు పంట సాయం అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఖరీఫ్ ఆశాజనకంగా ఉండడంతో పత్తి సాగు మండలంలో గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి దాదాపు 30శాతం మేర అధికంగా పత్తి సాగుచేశారు. పాలకుర్తి మండలంలో 10095 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. భారీ వర్షాలు లేనప్పటికీ అప్పడప్పడు చినుకులు పడడంతో పంట సాగు పెరుగుదల ఆశాజనకంగా ఉండేది. చీడపీడల ఉద్ధృతి, కూలీల సమస్య ప్రస్తుతం పంట నష్టం రైతులను నట్టేట ముంచింది. తెల్లబంగారం రంగు మారి కాయల్లోని పత్తి నల్లగా ఉంటున్నది. చేతికొచ్చిన పంటను తీసుకోలేని దుస్థితి నెలకొందని పత్తిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles