37 రూట్లు..117 బస్సులు


Sat,October 19, 2019 02:58 AM

-14వ రోజూ ఆర్టీసీ అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
-పర్యవేక్షించిన నోడల్ అధికారి మధుమోహన్
-బస్సులను తనిఖీ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది


జనగామ టౌన్, అక్టోబర్ 18: జనగామ ఆర్టీసీ డిపో నుంచి 37 రూట్లలో 92 ఆర్టీసీ, 25 అద్దె బస్సులు మొత్తం 117 బస్సులు నడిపినట్లు జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్య ధరంసింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బస్సుల రవాణాపై వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 14వ రోజుకు చేరింది.

దీంతో జనగామ ఆర్టీసీ డిపో నుంచి ప్రతి రోజు 80కిపైగా బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుపుతున్నామని, ఈ నేపథ్యంలో తాము చేపడుతున్న చర్యలతో ప్రయాణికులపై సమ్మె ప్రభావం లేదని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. కాగా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డిపో నోడల్ అధికారి సీహెచ్ మధుమోహన్, జనగామ తహసీల్దార్ రవీందర్, ఏసీపీ వినోద్‌కుమార్ బస్సులను పరిశీలించి రవాణా చేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధం గా జిల్లా రవాణాశాఖ అధికారి రమేశ్‌రాథోడ్ , ఎన్‌పోర్స్‌మెంట్ అధికారి అశోక్‌కుమార్, జనగామ ఎంవీఐ సాయిచరణ్, సీఐ మల్లేశ్‌యాదవ్ బస్సు ల్లో తనిఖీ నిర్వహించారు. అంతకుముందు తాత్కాలిక డ్రైవర్లకు విధులు కేటాయించారు. ఈ మేరకు జనగామ డిపో, బస్టాండ్ ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా జనగామ రైల్వేస్టేషన్, నెహ్రూపార్క్ సెంటర్ మీదుగా ప్రధాన కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles