పెండింగ్ ఖాతాలను త్వరగా పూర్తిచేయాలి


Sat,October 19, 2019 02:56 AM

-స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో రమేశ్
చిలుపూర్: మండల పరిధిలోని పెండింగ్ ఖాతాలను త్వరగా పూర్తిచేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో రమేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి పెండింగ్ ఖాతాల వివరాలపై తహసీల్దార్ శ్రీలతను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రెవెన్యూ పరమైన సమస్యలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మండలంలోని 11,971ఖాతాలుండగా, అందులో 11,332 ఖాతా లు పూర్తయ్యాయని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ సూర్యనాయక్, సీనియర్ అసిస్టెంట్ రాజు, ఆర్‌ఐలు సురేశ్, మంజుల, వీఆర్వోలు రాజేశ్వర్, నాగేశ్వర్‌రావు, సంపత్ ఉన్నారు.

70

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles