ప్రజలకు కేసీఆర్‌పై నమ్మకం పెరిగింది


Sat,October 19, 2019 02:55 AM

దేవరుప్పుల, అక్టోబర్ 18: బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషిచేస్తూ, నిరంతరం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పెరిగిందని సీఎం ఓఎస్డీ, కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. దక్షిణాఫ్రికాలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం అక్కడికి వెళ్లిన ఆయనకు ఎన్‌ఆర్‌ఐలు ఘన స్వాగతం పలికినట్టు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అసోషియేషన్ మీడియా ఇన్‌చార్జి కడవెండికి చెందిన కిరణ్ బెల్లి తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ బెల్లి మాట్లాడుతూ ఆఫ్రికాలోని డ్రీమ్ హిల్స్ స్కూల్‌లో శనివారం జరిగే సాహిత్య విభావరి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనట్లు తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎన్‌ఆర్‌ఐలు దేశపతి శ్రీనివాస్‌ను అడగగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంతో ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ నేల సస్యశ్యామలం అవుతుందని ఎన్‌ఆర్‌ఐలకు వివరించారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, రైతు పెట్టుబడి, రైతుబీమా వారికి వరమైనదని ధీమా వ్యక్తం చేశారన్నారు. తాము డిసెంబర్‌లో తమ సంస్థ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నామని, దేశపతిని శ్రీనివాస్‌ను ఈ ఉత్సవాలకు మరోమారు ఆహ్వానించినట్టు కిరణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల, ప్రధానకార్యదర్శి నరేందర్ ముదసాని, కోశాధికారి హరీశ్ రాగాల, కన్వీనర్ వెంకట్‌రావు, కల్చరల్ ఇన్‌చార్జి నాగదీప్, వెల్ఫేర్ ఇన్‌చార్జి రాజశేఖర్ పాల్గొన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles