ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి


Sat,October 19, 2019 02:55 AM

-జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి
తరిగొప్పుల, అక్టోబర్18: ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే జిల్లా సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతుందని జనగామ ఎమ్మెల్యేముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మరియాపురంలో సర్పంచ్ బీరెడ్డిజార్జిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తడి,పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆయన చెత్తబుట్టలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు పరిశుభ్రత పాటిస్తే స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు. అలాగే సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడినాయని రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలుంటాయని తెలిపారు. యువత మనోధైర్యంగా జివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు ముద్దసానిపద్మరెడ్డి, ఎంపీపీ జొన్నగోని హరిత, మండల శాఖ అధ్యక్షుడు పింగిళిజగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీడీవో కృపాకర్, ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి రామరావు, నాయకులు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles