స్టేషన్‌ఘన్‌పూర్‌లో భారీ వర్షం


Sat,October 19, 2019 02:55 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ : స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో విశ్వనాథపురం, చంద్రుతండాకు చెందిన రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడిసి ముద్దయింది. కంకులు ఆరబెట్టుకోడానికి మార్కెట్ యార్డుకు తరలించిన రైతులకు వాన నిరాశను మిగిల్చింది. పంట తడవడంతో రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిది. అలాగే వరి పంటలు వరుసగా కురుస్తున్న వర్షాలకు నేలవాలి రైతులకు నష్టాన్ని మిగులుస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలవుతున్నదన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది పంట దిగుబడి బాగా తగ్గే అవకాశముందని రైతులు వాపోతున్నారు. కాగా వ్యవసాయ మార్కెట్‌లో కొంతమంది రైతులు ముందస్తుగానే మొక్కజొన్న పంటపై పాలిథీన్ కవర్లు కప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

85

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles