వేగానికి స్పీడ్ గన్ కళ్లెం


Fri,October 18, 2019 03:23 AM

దేవరుప్పుల, అక్టోబర్ 17 : దేవరుప్పుల పోలీస్ స్టేసన్‌పరిధిలో ఏర్పాటు చేసిన స్పీడ్ గన్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. జనగామ- సూర్యాపేట రోడ్డును 365 నెంబర్ జాతీయ రహదారిగా మార్చి పనులు పూర్తి చేయగా ఈ రోడ్డుపై వాహనాల వేగం పెరగడంతో అదే స్థాయిలో ప్రమాదాల శాతం పెరిగింది. దీన్ని అరికట్టేందుకు పోలీసుశాఖ ఈ రోడ్డుపై ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. డీసీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు కదిలిన పాలకుర్తి సీఐ రమేశ్, దేవరుప్పుల ఎస్సై రామారావు నిరంతర నిఘాకు స్పీడ్ గన్ ఏర్పాటు చేశారు. మరోవైపు వాహనదారులకు అవగాహన, సూచిక బోర్డుల ఏర్పాటు, అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటుచేశారు. కాగా గత నెల రోజుల నుంచి దేవరుప్పుల మండల పరధిలో స్పీడ్ గన్ నిఘా పెంచారు. నెల రోజుల్లో 4వేల పైచిలుకు వాహనాలను స్పీడ్ గన్‌తో పరిశీలించగా 2500 వాహనాలు 80 కిలోమీటర్లపైన వేగంతో వెళ్లినట్లు ధ్రువీకరించారు.


దీంతో ఒక్కొక్కరికి రూ.1100 వరకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా స్పీడ్‌గన్ నిర్వహకుడు కానిస్టేబుల్ రవీంద్రాచారి మాట్లాడుతూ..

దేవరుప్పుల మండలంలో జాతీయ రహదారి విస్తరించి ఉండడం వల్ల రోడ్డుపై వాహనాలు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ప్రమాణంతో తయారు చేశారని, ఈ వేగం ప్రమాదానికి కారణమౌతుందన్నారు. ఈ స్పీడ్‌గన్ హైఫ్రీక్వెన్సీ లేజర్‌తో పని చేస్తుందని, శాటిలైట్‌తో అనుసంధానమై ఉండండతో 100 మీటర్ల దూరం నుంచి వాహన వేగాన్ని రికార్డు చేస్తుందన్నారు. ఒక వేళ ఆ వాహనం 80 కిలో మీటర్ల వేగం దాటితే వెంటనే ఆ వాహన యజమానికి ఆన్‌లైన్‌లో జరిమానా విధించబడుతుందన్నారు. ఈ జరిమానా ఎక్కడైనా మీసేవలో చెల్లించవచ్చునని సూచించారు.

60

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles