పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే


Fri,October 18, 2019 03:22 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : ఈనెల 21న జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి తరుపున ప్రచరారం చేసేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య వెళ్లారు. గురువారం నియోజవర్గంలో నేరేడుచర్ల మండలంలోని అన్ని గ్రామాల్లో సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఎమ్మెల్యే రాజయ్య ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పులిచింతల ప్రాజెక్టును ఎమ్మెల్యే రాజయ్య సందర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే స్థానిక ప్రాజెక్టు అధికారులతో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వికలాంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ వాసుదేవారెడ్డి, లింగాలఘనపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు సతీష్‌రెడ్డి ఉన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles