పల్లెలకు ఆర్టీసీ బస్సులు పయనం


Fri,October 18, 2019 03:22 AM

జనగామ టౌన్, అక్టోబర్ 17: ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం 13వ రోజుకు చేరగా, ఈ ప్రభావం ప్రయాణికులపై పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, డిపో నోడల్ అధికారి మధుమోహన్, డీఎం భూక్య ధరంసింగ్ తాత్కాలిక సిబ్బందితో బుధవారం వరకు పట్టణాలకే బస్సులను నడపగా, గురువారం నుంచి జనగామ డిపో పరిధి 37 రూట్లలోని అన్ని గ్రామాలకు 80 ఆర్టీసీ బస్సులు, 25 అద్దె బస్సులను విజయవంతంగా నడిపినట్లు డిపో అధికారులు తెలిపారు.


ఈ సందర్భంగా డీఎం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో హన్మకొండ, హైదరాబాద్, ఉప్పల్, సూర్యాపేట, సిద్దిపేట, హుస్నాబాద్ ప్రాంతాలకు మాత్రమే బస్సులు నడిపామన్నారు. ప్రస్తుతం పట్టణాలతోపాటు అన్ని గ్రామాలకు పాత పద్ధతిలో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా తాత్కాలిక సిబ్బందితో టిమ్ సర్వీస్‌ను జనగామ డిపో పరిధిలో ప్రారంభించడంతో డీఎంను రాష్ట్ర, ఉమ్మడి జిల్లా అధికారులు అభినందించారు. అలాగే, జిల్లా రవాణా శాఖ అధికారి రమేశ్ రాథోడ్ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అశోక్‌కుమార్, జనగామ ఎంవీఐ సాయిచరణ్ పర్యవేక్షిస్తున్నారు. డీఎం వెంట జనగామ తహసీల్దార్ రవీందర్, డీటీ రమేశ్ ఉన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles