హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి గెలుపు ఖాయం


Fri,October 18, 2019 03:21 AM

చిలుపూర్, అక్టోబర్ 17: హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు ఖాయమని జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం స్థానిక విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ పేదలకు అందుతున్నాయని, పాలకవీడు మండల పరిధిలోని ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ కాల్వ కింద ఉన్న వ్యవసాయ భూములన్నింటికీ సాగునీరు పుష్కలంగా అందుతుందని చెప్పారు. ప్రతి రైతుకు బీమా, రైతుబంధు పథకాలు సక్రమంగా అందుతున్నట్లు వెల్లడించారు. పంట పెట్టుబడిగా రైతుబంధు సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారని తెలిపారు. ప్రతి వృద్ధుడు నెలవారీగా పెన్షన్ అందుకుంటున్నారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను టీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్నదని ఇక్కడి ప్రజలు చెప్పారన్నారు.


అదే విధంగా రైతులకు ఇబ్బందుల్లేకుండా ఎరువులు అందుతున్నట్లు చెప్పారని తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో గ్రామాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలు కూడా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారన్నారు. సైదిరెడ్డిని గెలిపిస్తేనే సంక్షేమ పథకాలన్నీ తమకు అందుతాయని ప్రజలు ఆశిస్తున్నారని, మరింత అభివృద్ధికి ఆయన గెలుపు అవసరమంటున్నట్లు సంపత్‌రెడ్డి తెలిపారు. ప్రచారంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎంపీటీసీ గన్ను నర్సింహులు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు జనగామ యాదగిరి, చిలుపూర్ సర్పంచ్ ఉద్దెమారి రాజ్‌కుమార్‌తోపాటు పలువురు వారం రోజులుగా మండల పరిధిలోని 12 గ్రామాల్లో సైదిరెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు.

45

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles