పంట రుణాలను రెన్యూవల్ చేసుకోవాలి


Thu,October 17, 2019 03:22 AM

-సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీశైలం
బచ్చన్నపేట,అక్టోబర్ 16: రైతులు పంట రుణాలను వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని బచ్చన్నపేట సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీశైలం సూచించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకులో తీసుకున్న పంట రుణాలు చాలామంది రైతులు రెన్యూవల్ చేసుకోవడం లేదన్నారు. పంట రుణాల రెన్యూవల్‌కు, సీఎం పంట రుణమాఫీకి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. రుణాలను రెన్యూవల్ చేసుకుని తిరిగి కొత్త రుణాలు తీసుకున్నా సీఎం అమలు చేస్తున్న పంటరుణాల మాఫీ వర్తిస్తుందన్నారు. ఇందులో రైతులు అయోమయానికి గురికావొద్దన్నారు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా జీవనోపాధి కోసం తీసుకున్న రుణాల వాయిదాలు సకాలంలో చెల్లించడం లేదన్నారు. బ్యాంకులో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తేనే తిరిగి కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ రుణాలను వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా చెల్లించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.

65

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles