సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం


Thu,October 17, 2019 03:21 AM

గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బంది వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ మండలకేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో జీపీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. వేతనాల పెంపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గుడిందుల నరహరి, ఇట్టబోయిన రమేశ్ పాల్గొన్నారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles