60రోజుల కార్యక్రమాన్ని చేపట్టిన మిషన్ భగీరథ అధికారులు


Wed,October 16, 2019 02:21 AM

జనగామ రూరల్, అక్టోబర్15: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని ఎంపీపీ మేకల కలింగరాజు తెలిపారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయలంలో నిర్వహించిన ప్రజా ప్రతినిధుల అవగాహన సదస్సుకు ఆయన హజరై మాట్లాడారు. నీటికోసం చాలా ఇబ్బందులు పడిన కరువు గడ్డకు ఇప్పుడు గోదావరి జలాలతో పాటు తాగునీటికి మిషన్ భగీరథ నీరు అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటే త్వరగా తీర్చాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామ ప్రణాళిక కార్యాక్రమం ఎలా అమలు చేసిందో.. అలాగే, మిషన్ భగీరథ పథకంలో అన్ని సమస్యలు పరిష్కరించేందుకు 60రోజుల ప్రణాళిక తీసుకువస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడ నీటి సమస్య ఉన్న, పైపులైన్ లీకేజీ, వాటర్ సక్రమంగా రాకుండా ఉండటం, వాటర్‌ట్యాంకుల లీకేజీ వాంటివి ఉంటే సత్వరమే సమస్యను తీర్చుతామని అధికారులు చెప్పారు. పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామాల్లో సక్రమంగా వాటర్ రావడం లేదని, కొన్ని గ్రామాల్లో పైపులైన్ లీకేజీలు ఉన్నాయని, నల్లాలు పని చేయడం లేదని, కొందరికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదని సదస్సులో వివరించారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకే 60రోజుల ప్రణాళిక తీసుకువచ్చి గ్రామంలో వాటర్ సమస్యను పూర్తిగా తీర్చుతామని అందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నిమ్మతి దీపిక, వైస్ ఎంపీపీ గద్ద చంద్రశేఖర్, మిషన్ భగీరథ అధికారులు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారద, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

66

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles